NTV Telugu Site icon

Mahua moitra: మహువా మొయిత్రాకు షాక్.. ఈడీ కేసు నమోదు

Tmc

Tmc

క్యాష్ ఫర్ క్వారీ ఆరోపణలపై గతేడాది లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా(49)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఆమెపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలతో ఆమె డిసెంబర్ 8, 2023న లోక్‌సభ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయింది. తాజాగా అదే కారణంతో మరిన్ని చిక్కుల్లో పడ్డారు. క్యాష్ ఫర్ క్యారీ దర్యాప్తులో భాగంగా ఆమెపై ఈడీ మనీ లాండరింగ్ కేసును మంగళవారం నమోదు చేసింది.

ఇది కూడా చదవండి: Mrunal Thakur: తెలుగు ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ సాష్టాంగ నమస్కారం

ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. ఢిల్లీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇటీవల ఇచ్చిన సమన్లను మహువా మొయిత్రా బేఖాతరు చేసిన కారణాన ఈడీ తాజా చర్యకు దిగింది. ఫెమా చట్టా్న్ని ఉల్లంఘించారనే కారణంగా ఆమెతో పాటు వ్యాపారవేత్త దర్శన్ హిరానందానికి ఈడీ సమన్లు జారీచేసింది. ఈ కేసులో బీజేపీ ఎంపీ నిషాకాంత్ దుబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోక్‌పాల్ ఇచ్చిన ఆదేశాలతో మహువా మొయిత్రా నివాసాలపై కొద్ది కాలం క్రితం సీబీఐ దాడులు జరిపింది. అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఇది కూడా చదవండి: Dil Raju: నన్ను ఆఖరికి దిల్ మామని చేసేసారా

ఇక క్యాష్ ఫర్ క్వారీ వ్యవహారంలో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన మొయిత్రాకు తాజా లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరిగి టిక్కెట్ ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని కృష్ణనగర్ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. ఈసారి ఆమెకు టికెట్ రాదని భావించారు కానీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం మొయిత్రాకు టికెట్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Zomato: జొమాటోకు జీఎస్టీ భారీ షాక్.. నోటీసులో ఏముందంటే..!