తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ వాన పడుతోంది. కాగా భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. ఈ రెండు జలాశయాల నుంచి మూసీకి వరద ప్రవాహం పెరిగింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేశారు అధికారులు. నిన్న మధ్యాహ్నం నుంచి బ్రిడ్జి మూసివేశారు. ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ని గోల్నాక వైపు మళ్లించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు.
Moosarambagh Bridge: మూసీకి పెరిగిన వరద.. ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేత..
- మూసీకి పెరిగిన వరద
- ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేత

Moosarambagh Bridge