Montha Cyclone Effect: అందిన సమాచారం మేరకు ‘మొంథా’ తుఫాన్ దిశను మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో 3-4 గంటలు అత్యంత కీలకం కానుంది. తుఫాను తీరాన్ని దాటడానికి మరో 6 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులతో కలిపి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ‘మొంథా’ తుఫాను ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
Movie Tickets Rates : తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఛాన్స్..?
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ ప్రభావిత ఏడు జిల్లాల్లో ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
ఈ ఏడు జిల్లాల పరిధిలోని జాతీయ రహదారులతో సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. వాహనాల నిలిపివేత ఆంక్షల నుంచి కేవలం అత్యవసర వైద్య సేవలు (Emergency Medical Services) కోసం వెళ్లే వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన వాహనాలు ఏవీ ఈ సమయంలో రోడ్లపైకి రావడానికి అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల్లోని ప్రజలంతా తప్పనిసరిగా తమ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది. తుఫాన్ తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ వర్షపాతం కారణంగా ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండటం అత్యవసరం.
