NTV Telugu Site icon

Monsoon : వర్షాకాలంలో రోగాలు రావొద్దంటే.. వీటిని తప్పక తీసుకోవాలి..

Monsoonfood

Monsoonfood

వర్షాకాలం వచ్చిందంటే చాలు రోగాలు కూడా వద్దన్న వస్తాయి.. మనల్ని చుట్టుముడతాయి. జలుబు, దగ్గు, జ్వరం, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, విరోచనాలు, వాంతులు ఇలా అనేక రకాల ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటాము.. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే కొన్ని రకాల ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.. ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాతావరణం మారడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం సహజమే. అయితే వీటి బారిన మనం పడకుండా ఉండాలంటే మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండేలా చూసుకోవాలి. ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉండాలంటే కాలానుగుణంగా లభించే ఆహారాలను తీసుకోవడం, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి. జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడడానికి బదులుగా చక్కటి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.. ముఖ్యంగా వర్షాకాలంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో పచ్చిమిరపకాయ ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటాయి.. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రో గ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఆహారం ద్వారా వ్యాపించే అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా ఉంటాము..విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, జామ, చెర్రీ, ఆల్ బుకరా, ప్లమ్స్, దానిమ్మ వంటి వాటిని తీసుకోవాలి. వీటిని సాధ్యమైనంత వరకు నమిలి తినాలి లేదా ఇంట్లోనే జ్యూస్ గా చేసి తీసుకోవాలి. బయట రోడ్ల పక్కన లభించే జ్యూస్ లను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే వర్షకాలంలో ఎక్కువగా సూప్, గ్రీన్ టీ, మసాలా టీ వంటి వాటిని తీసుకోవాలి. వీటిని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవడానికి ప్రయత్నించాలి.. ఇక ఆకు కూరలను ఈ కాలంలో తీసుకోక పోవడమే మంచిది..

వర్షాకాలంలో ఏ కూరగాయలునైనా ఉడికించి తీసుకోవడం ఉత్తమం.. బీన్స్, చిక్కుళ్లు, గుడ్లు, సోయా, పాలు మరియు పాల ఉత్పత్తులు వంటి వాటిని తీసుకోవాలి. అలాగే అల్లం మరియు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్లమేటరీ వంటి లక్షణాలు అధికంగా ఉన్నాయి..వీటిని తీసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారినపడకుండా ఉంటాము. అదే విధంగా ఆహారంలో భాగంగా పసుపు కలిపిన పాలను తీసుకోవాలి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయాల్ వంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి,. శరీరంలో రోగనిరోధక శక్తి ని పెంచి జబ్బుల బారిన పడకుండా చేయడంలో పసుపు ఎంతగానో దోహదపడుతుంది.. వీటిని తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉంటారు..