NTV Telugu Site icon

Southwest Monsoon: ఏపీలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

Maxresdefault (3)

Maxresdefault (3)

Monsoon in AP: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ సాధారణం కంటే రెండు రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి రానున్న రెండు, మూడు రోజులల్లో ఏపీ మొత్తం విస్తరించనున్నాయని ఈ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో సోమవారం మోస్తరు వర్షాలు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందనని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.