NTV Telugu Site icon

Monkey Fight with Dog: పిల్లలను అన్నం తిననివ్వని తల్లి కుక్క.. కోపం వచ్చిన కోతి ఏం చేసిందంటే

Monkey

Monkey

ప్రపంచంలో ఏ తల్లి అయినా పిల్లలు తిన్నాకే తాను తింటుంది. పస్తులు ఉండే పరిస్థితులు వస్తే ఉన్న కొంచెం అయినా మొదట పిల్లలకు పెట్టి తాను మంచి నీరు తాగైనా బతుకుంది. పిల్లల కోసం, వారి ఆకలిని తీర్చడానికి తల్లి ఏం చేయడానికైనా సిద్దపడుతుంది. ఇది కేవలం మనుషుల్లో మాత్రమే కాదు జంతు జాతుల్లో అయినా తల్లి ప్రేమ అలానే ఉంటుంది. అయితే ఇక్కడ ఓ తల్లి కుక్క మాత్రం తల్లి ప్రేమ మరచి తన పిల్లలకు పెట్టకుండా ప్లేట్ లో ఉన్న మొత్తం అన్నాన్ని తినేస్తూ ఉంటుంది. దగ్గరకు వచ్చిన కుక్క పిల్లలపై మొరుగుతుంది కూడా. అయితే ఆ కుక్క పిల్లలకు అండగా నిలబడి ఆ తల్లి కుక్కను తరిమి వాటికి అన్నం పెట్టింది ఓ కోతి. చూడటానికి ఎంతో ముచ్చటేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా కోతికి కుక్కకు అస్సలు పడదు. ఇవి రెండు ఒక చోట ఉన్నాయంటే గొడవపడటం ఒకదానిపై ఒకటి దాడిచేసుకోవడం సహజం. అయితే దీనికి భిన్నంగా ప్రవర్తించింది ఓ కోతి. తన తల్లిన మనసును చాటుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ తల్లి కుక్క ప్లేట్ లో ఉన్న దాన్ని గబగబ తింటూ ఉంటుంది. అయితే మధ్యలో నేనే తింటాను ఆకలేస్తోంది అన్నట్లు ఓ కుక్క పిల్ల ఆ ప్లేట్ దగ్గరకు వస్తుంది. తల్లి కదా బిడ్డకు అన్నం పెడుతుంది అనుకంటే ఆ కుక్క పప్పీ మీద అరుస్తుంది. దానిని తినకుండా అడ్డుకుంటుంది. ఇదంతా చూస్తున్న కోతికి చిర్రెత్తుకొస్తుంది. కుక్క పిల్లను స్వయంగా కోతే మళ్లీ అక్కడికి తీసుకువస్తుంది. అయితే ఆ పెద్ద కుక్క మళ్లీ అరుస్తుంది. నువ్వసలు తల్లివేనా ఆ కుక్క పిల్లలకు నేనున్నానంటూ ఆ పెద్ద కుక్కను అక్కడి నుంచి తరిమేస్తోంది.

Also Read: Viral Video: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన తాగుబోతు… వీడియో చూస్తే నవ్వులే నవ్వులు

అంతేకాకండా ఆ కోతే స్వయంగా ఆప్లేట్ తీసుకువచ్చి కుక్క పిల్లల ముందు పెడుతుంది. అక్కడ ఉన్న చాలా పప్పీలు అక్కడికి వచ్చి తింటూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆ కోతి ఆ కుక్క పిల్లలపై ఉన్న మమకారాన్ని చాటుకుంది. అవి తింటూ ఉంటే వాటి తల నిమురుతూ అచ్చం కన్నతల్లిలాగా ప్రవర్తించింది. ఈ వీడియోలో కోతి షర్ట్ కూడా వేసుకుంది. బ్లూ కలర్ షర్ట్ ప్యాంట్ వేసుకున్న ఆ కోతి అచ్చు మనిషిలానే ప్రవర్తించింది. ఈ వీడియోను ఘర్ కే కాలేష్ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతుంది. పప్పీల కోసం తల్లి కుక్కతో పోరాడిన కోతి అంటూ ఆ వీడియో క్యాప్షన్ ఇవ్వగా ఇప్పటి వరకు అనేక మంది వీడియో చూశారు. ఆ కోతిపై చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోతిది చాలా మంచి మనసు అని ఆ పప్పీలకు నిజమైన తల్లిలా చూసుకుంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Show comments