Viral Video: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన తాగుబోతు… వీడియో చూస్తే నవ్వులే నవ్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాగితే చాలా మంది చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఫుల్ గా తాగితే ప్రపంచం ఎటుపోతున్నా దానితో మాకు పనిలేదంటారు. కొంతమంది తాగి ఇంట్లో పడుకుంటే మరికొందరు మాత్రం రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘనలను కొంతమంది వీడియో తీస్తూ ఉంటారు. సోషల్ మీడియా వినియోగం ఎక్కవయ్యాక ఇటువంటి వీడియోలు కూడా ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వీటిలో కొన్ని చిరకు తెప్పించేలా ఉంటే కొన్ని మాత్రం నవ్వులు పూయిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ఓ తాగుబోతు చేసిన పని నవ్వు తెప్పిస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు జరిగినట్టు మాత్రం వీడియో చూస్తే అర్థం అవుతుంది.
ఈ వీడియోలో ఓ తాగుబోతు రద్దీగా ఉన్న రోడ్డుపై వాహనాల మధ్యలో నుంచి వెళుతూ ఉంటాడు. అంతేకాదు వాహనాలను ఆపాలంటూ చేయి అడ్డుపెడుతూ ఉంటాడు. అయినా ఏ వాహనం కూడా ఆగదు. దీంతో ఆ తాగుబోతూ ఓ స్కూటీని గట్టిగా పట్టుకొని ఆపుతాడు. అయితే ఆ స్కూటీ నడుపుతున్న వ్యక్తి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెల్లటి బట్టలు ధరించి జాతీయ జెండా ఉన్న కండువాను పైన కప్పుకొని ఉంటాడు. స్కూటీని రోడ్డుపై అలా అడ్డంగా ఆపడంతో పాటు అతనికి చేయి చూపిస్తూ ఏదో అంటాడు. దీంతో ఆ వ్యక్తికి కోపం వచ్చి స్కూటీ దిగివచ్చి ఆ తాగుబోతు కాలర్ పట్టుకొని అతడి చెంపపై కొడతాడు. అంతేకాకుండా అతని మెడ పట్టుకొని నేలపై పడవేసి తన్నడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అటుగా బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి అతడిని కొట్టకుండా ఆపి గొడవను సద్దుమణిగేలా చేస్తాడు. అయితే ఇక్కడ చివరిలో ఒక కొసమెరుపు జరిగింది. అది చూస్తే మాత్రం కచ్ఛితంగా నవ్వు వస్తుంది. అన్ని దెబ్బలు తిన్న తరువాత కూడా ఆ తాగుబోతు వెళుతూ వెళుతూ తనని తన్నిన వ్యక్తిని చూసి డ్యాన్స్ చేస్తాడు. ఇది కూడా మనకు వీడియోలో కనిపిస్తోంది. ఇది చూస్తే ఆ తాగుబోతుకు ఇంకా బుద్ధి రాలేదు ఇంకా రెండు పడాల్సింది అనిపిస్తోంది. అంతేకాదు ఇక్కడ విశేషం ఏంటంటే స్వాతంత్ర్య దినోత్సవం రోజు మువన్నెల రంగు టోపీని ధరించాడు.
Also Read
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
Also Read: Sneeze : తుమ్మును ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తి… తరువాత పెద్ద షాక్
ప్రస్తుతం సాక్షి అనే వ్యక్తి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ తాగుబోతును చూస్తే నవ్వొస్తుందని కొందరు అంటుంటే, అంత కొట్టినా సిగ్గులేకుండా డ్యాన్స్ చేశాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తాగి రోడ్డు మీదకి వస్తే ప్రమాదమని ఇంకొందరు సూచిస్తున్నారు. అలాంటి వారిని అలాగే కొట్టాలంటూ కొంతమంది కొట్టిన వ్యక్తిన సమర్థిస్తున్నారు. మొత్తానికైతే చూడగానే నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసి ఆనందించండి.
Happy Independence day! 😢😢🇮🇳 pic.twitter.com/d1lH744FBD
— Ajey Patel (@AjeyPPatel) August 15, 2023
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!