Site icon NTV Telugu

T20 Lowest Score: టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో రెండో అత్య‌ల్ప స్కోర్.. కేవలం 12 ప‌రుగుల‌కే ఆలౌట్‌..

T20 Lowest Score

T20 Lowest Score

టీ20 క్రికెట్‌లో మంగోలియా జట్టు ఓ రికార్డును సొంతం చేసుకుంది. జట్టు కేవలం 12 గోల్స్ మాత్రమే సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 8.5 ఓవర్లలోనే టీం ఆలౌట్ అయ్యింది. ఈ సందర్బంగా జపాన్ 205 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కనీస స్కోరు 10 కావడం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరి 26న స్పెయిన్‌ పై 10 పరుగులే చేయడంతో ‘ఐసిల్ ఆఫ్ మ్యాన్’ చెత్త రికార్డు నమోదు చేసింది.

Also Read: Wine Shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 48 గంట‌ల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్‌..

సేన్ క్రికెట్ గ్రౌండ్‌లో మంగోలియా, జపాన్ మధ్య మ్యాచ్ జరిగింది. జపాన్ ముందు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. జపాన్ బ్యాట్స్ మెన్లలో సుబ్రీష్ రవిచంద్రన్ (69, 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి అర్ధ సెంచరీ సాధించగా., కెప్టెన్ కెండల్ కడవకి ఫ్లెమింగ్ (32), ఇబ్రహీం తకాహషి (32) అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన మంగోలియా ఆటగాళ్లకు జపాన్ బౌలర్ ‘కజుమా కటో స్టాఫోర్డ్’ కోలుకోలేని దెబ్బ వేసాడు. 3.2 ఓవర్లు వేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు నేలకూల్చాడు. దింతో మంగోలియా 8.5 ఓవర్లలో 12 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్‌ లో ఆరుగురు బౌల్డ్ కావడం విశేషం. ఇక మంగోలియా జట్టులో సుమియా చేసిన 4 పరుగులే అత్యధిక స్కోరు.

Also Read: Shakib Al Hasan: కాస్త డాక్టర్స్ కు చూపించండయ్యా.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేసిన బంగ్లా స్టార్ ప్లేయర్‌..

ఇక ఇప్పటి వరకు టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్య‌ల్ప స్కోర్లు వివరాలు చూస్తే..
* 10 – ఐల్ ఆఫ్ మ్యాన్ vs స్పెయిన్ (2023)
* 12 – మంగోలియా vs జపాన్ (2024)
* 21 – టర్కీ vs చెక్ రిపబ్లిక్ (2019)
* 23 – చైనా vs కౌలాలంపూర్ (2023)
* 24 – రువాండా vs నైజీరియా (2023) గా ఉన్నాయి.

Exit mobile version