T20 Lowest Score: టీ20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్.. కేవలం 12 పరుగులకే ఆలౌట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 క్రికెట్‌లో మంగోలియా జట్టు ఓ రికార్డును సొంతం చేసుకుంది. జట్టు కేవలం 12 గోల్స్ మాత్రమే సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 8.5 ఓవర్లలోనే టీం ఆలౌట్ అయ్యింది. ఈ సందర్బంగా జపాన్ 205 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కనీస స్కోరు 10 కావడం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరి 26న స్పెయిన్ పై 10 పరుగులే చేయడంతో ‘ఐసిల్ ఆఫ్ మ్యాన్’ చెత్త రికార్డు నమోదు చేసింది.
Also Read: Wine Shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
సేన్ క్రికెట్ గ్రౌండ్‌లో మంగోలియా, జపాన్ మధ్య మ్యాచ్ జరిగింది. జపాన్ ముందు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. జపాన్ బ్యాట్స్ మెన్లలో సుబ్రీష్ రవిచంద్రన్ (69, 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి అర్ధ సెంచరీ సాధించగా., కెప్టెన్ కెండల్ కడవకి ఫ్లెమింగ్ (32), ఇబ్రహీం తకాహషి (32) అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన మంగోలియా ఆటగాళ్లకు జపాన్ బౌలర్ ‘కజుమా కటో స్టాఫోర్డ్’ కోలుకోలేని దెబ్బ వేసాడు. 3.2 ఓవర్లు వేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు నేలకూల్చాడు. దింతో మంగోలియా 8.5 ఓవర్లలో 12 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్ లో ఆరుగురు బౌల్డ్ కావడం విశేషం. ఇక మంగోలియా జట్టులో సుమియా చేసిన 4 పరుగులే అత్యధిక స్కోరు.
ఇక ఇప్పటి వరకు టీ20 క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు వివరాలు చూస్తే..
* 10 – ఐల్ ఆఫ్ మ్యాన్ vs స్పెయిన్ (2023)
* 12 – మంగోలియా vs జపాన్ (2024)
* 21 – టర్కీ vs చెక్ రిపబ్లిక్ (2019)
* 23 – చైనా vs కౌలాలంపూర్ (2023)
* 24 – రువాండా vs నైజీరియా (2023) గా ఉన్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!