NTV Telugu Site icon

IPS Rashmi : నిన్న ఐఏఎస్ పూజ నేడు ఐపీఎస్ రష్మీ.. చీకటి వ్యవహరాలు జరుపుతున్న ఆమె భర్త

New Project 2024 07 17t104903.251

New Project 2024 07 17t104903.251

IPS Rashmi : ఐఏఎస్ పూజా ఖేద్కర్, మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ తర్వాత ఇప్పుడు ఐపీఎస్ రష్మీ కరాండీకర్ వార్తల్లో నిలిచారు. తన భర్త చేసిన చీకటి దోపిడీ కారణంగా ఆమె వెలుగులోకి వచ్చింది. నిజానికి, ఐపీఎష్ రష్మీ కరాండికర్ భర్త పురుషోత్తం చవాన్ టీడీఎస్ రీఫండ్ మోసం కేసులో అరెస్టయ్యాడు. అతని గురించి కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. పురుషోత్తం చవాన్ తన ఐపీఎస్ భార్య రష్మీ కరాండీకర్ కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను పంపి ఆగస్ట్ 2023 – ఫిబ్రవరి 2024 మధ్య వ్యాపారవేత్త రాజేష్ బత్రేజా నుండి నగదు, పత్రాల బ్యాగుల నిండుగా సేకరించడానికి పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు పురుషోత్తం చవాన్‌కు విడతల వారీగా రూ.10.40 కోట్లు ఇచ్చినట్లు బత్రేజా అంగీకరించాడు. 263 కోట్ల ఆదాయపు పన్ను టీడీఎస్ రీఫండ్ ఫ్రాడ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసింది. చవాన్, బత్రేజా, ట్యాక్స్ కన్సల్టెంట్ అనిరుధ్ గాంధీపై ఫిర్యాదు నమోదైంది. ఇది కాకుండా, M/s AG ఎంటర్‌ప్రైజెస్, M/s యూనివర్సల్ మార్కెటింగ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ LLP (UMAS), Dwalax Enterprises Pvt.పై కూడా ఫిర్యాదులు వచ్చాయి.

కోర్టు ఏం చెప్పింది?
ప్రత్యేక పీఎంఎల్ఏ న్యాయమూర్తి ఏసీ దాగా, ఈడీ ఫిర్యాదును స్వీకరించారు. నిందితులు నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని.. ఇతర నిందితులకు భారతదేశం నుండి దుబాయ్ – దుబాయ్ నుండి భారతదేశానికి హవాలా ఛానెల్ ద్వారా డబ్బును బదిలీ చేయడంలో సహాయం చేసినట్లు ఫిర్యాదు వెల్లడిస్తుంది. ఆదాయపు పన్ను (ఐ-టి) మాజీ అధికారి తానాజీ మండల్ అధికారి 263 కోట్ల రూపాయల నకిలీ టిడిఎస్ (మూలం వద్ద తగ్గించబడిన పన్ను) రీఫండ్‌ను సిద్ధం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తానాజీని ముంబైలోని ఐటీ కార్యాలయంలో నియమించారు. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కనిపెట్టడానికి ఈడీ జరిపిన తదుపరి విచారణలో పురుషోత్తం చవాన్, బత్రేజాల పాత్ర వెలుగులోకి వచ్చింది. దానిని ఆ అధికారి దుబాయ్‌కు తరలించి, దానిని అబ్దుల్ అజీజ్ అలముల్లా వద్ద ఉంచుకున్నాడు.

ఏజెన్సీ బత్రేజా వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. ఆగస్టు 2023 నుంచి ఫిబ్రవరి 2024 వరకు పలు వాయిదాల్లో చవాన్‌కు రూ.10.40 కోట్లు ఇచ్చినట్లు అంగీకరించాడు. పురుషోత్తం చవాన్‌ను మేలో అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసులో ఇతర నిందితులు మాజీ ఆదాయపు పన్ను అధికారి తానాజీ మండల్ అధికారి, భూషణ్ పాటిల్, రాజేష్ శెట్టి, రాజేష్ బత్రేజా.