Money Transfer Wrong account: ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో డబ్బు లావాదేవీల ట్రెండ్ చాలా వేగంగా పెరిగింది. దీనివల్ల ప్రజలకు సౌకర్యాలు బాగా పెరిగాయి. అలాగే చాలా సార్లు పొరపాటున ప్రజలు తమ డబ్బును మరొక ఖాతాకు బదిలీ చేయడం కూడా జరుగుతోంది. అయితే, తప్పుడు ఖాతాకు డబ్బును బదిలీ చేసిన తర్వాత, మన మదిలో మెదిలే పెద్ద ప్రశ్న.. మన డబ్బు తిరిగి వస్తుందా అని… ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ విషయంలో కస్టమర్లకు సలహా ఇచ్చింది.
ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారుడు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. అనంతరం ఎస్‌బీఐ అధికారిక ట్విటర్‌లో దీనిపై ఫిర్యాదు చేశాడు. SBIని ట్యాగ్ చేస్తూ.. TheOfficialSBI నేను పొరపాటున నా డబ్బును తప్పు ఖాతా నంబర్‌కు పంపాను అని కస్టమర్ రాశారు. హెల్ప్‌లైన్ ద్వారా చెప్పబడిన వివరాలన్నీ నా శాఖకు ఇచ్చాను. ఇప్పటికీ నా శాఖ రివర్సల్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.
Read Also:Lifestyle : పెళ్లికి ముందు కాబోయేవారిని ముఖ్యంగా అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే?
SBI.. ఈ ట్వీట్‌కు ప్రతిస్పందనగా, కస్టమర్ తప్పు ఖాతాకు డబ్బు పంపిన సందర్భాల్లో.. హోమ్ బ్రాంచ్ ఎటువంటి పెనాల్టీ లేకుండా ఇతర బ్యాంకులతో.. మీ సమస్యపై తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఖాతాదారుడు తప్పుడు లబ్ధిదారు ఖాతా నంబర్‌ను పేర్కొన్నట్లయితే, కస్టమర్ హోమ్ బ్రాంచ్ ఎటువంటి డబ్బుల తగ్గింపు లేకుండా ఇతర బ్యాంకులతో ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఇంకా మీరు బ్రాంచ్ లో దీనికి సంబంధించి సమస్యను ఎదుర్కొన్నట్లైతే https://crcf.sbi.co.in/ccf క్రింద ఫిర్యాదు చేయండి.ఇచ్చిన కామెంట్ బాక్స్‌లో మీ సమస్య వివరాలను తెలియజేయండి. సంబంధిత బృందం పరిశీలిస్తుంది.
SBI ఏం సలహా ఇచ్చింది
SBI తన కస్టమర్లకు సలహా ఇస్తూ, డిజిటల్ లావాదేవీలు చేసే ముందు నమోదు చేసిన మొత్తం సమాచారాన్ని మరోసారి తనిఖీ చేయాలని వినియోగదారులను కోరింది. ఖాతాదారుడు ఏదైనా పొరపాటు చేసినట్లయితే, దానికి బ్యాంకు బాధ్యత వహించదు. ఏదైనా చెల్లింపు చేయడానికి ముందు లబ్ధిదారుని ఖాతా నంబర్, IFSC కోడ్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడం ముఖ్యం. ఇది ఎలాంటి పొరపాట్లను నివారించడంలో సహాయపడుతుంది.
Read Also:Guntur Kaaram: అలా షూటింగ్ స్టార్ట్ అయ్యింది… ఇలా లీకొచ్చింది
