NTV Telugu Site icon

Slovakia PM: స్లోవేకియా ప్రధానిపై కాల్పుల ఘటన.. వీడియో చూశారా..?

Slokavia

Slokavia

బుధవారం స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండుగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కాల్పుల్లో ప్రధాని గాయపడగా.. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు జరిపిన తర్వాత, ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈశాన్యంగా 150కి.మీ దూరంలో ఉన్న హ్యాండ్‌లోవా పట్టణంలోని తన మద్దతుదారులతో మాట్లాడుతున్న సమయంలో హౌజ్ ఆఫ్ కల్చర్ వెలుపల ఈ దాడి జరిగింది. నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Medical Negligence: వైద్యుల నిర్లక్ష్యం.. చిన్నారి చేతికి బదులు నాలుకకు శస్త్రచికిత్స..

కాగా.. ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులకు పాల్పడిన నిందితుడి వీడియో బయటికొచ్చింది. కాల్పులు జరిపిన అనంతరం.. సెక్యూరిటీ గార్డులు నిందితుడిని కారులో ఎక్కించి తీసుకెళ్లారు. కాల్చి పారిపోతుండగా నిందితుడిని అక్కడున్న కొంతమంది పట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. స్లోవాక్ మీడియా నుండి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఫికోపై చాలాసార్లు కాల్పులకు పాల్పడ్డాడు. పొట్టపై ఒకసారి, తలపై ఒకసారి కాల్చాడు. ఈ క్రమంలో.. ప్రధాని రాబర్ట్ ఫికో పరిస్థితి విషమంగా ఉంది. ప్రధాని రాబర్ట్ ఫికోపై దాడి జరిగిన తర్వాత.. ప్రత్యక్ష సాక్షులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Lightning Strike: పిడుగుల బీభత్సం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

ఫికోపై దాడిని పలువురు నేతలు ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని అభివర్ణించారు. రాబర్ట్ ఫికో త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స్లోవేకియాకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. మరోవైపు, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా ఈ ఘటనను ఖండించారు. ఈ ఘటనతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. ఈ భయంకరమైన వార్త విని షాక్ అయ్యానని సునక్ చెప్పారు.