Molestation In Metro: మహిళలకు సురక్షితమైన నగరంగా పేర్గాంచిన బెంగళూరులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కదులుతున్న మెట్రోలో ఓ యువతి వేధింపులకు గురైంది. కిక్కిరిసిన జనం మధ్య మెట్రో స్టేషన్‌లో ఆ వ్యక్తి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం కథను అమ్మాయి స్నేహితురాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ రెడ్డిట్‌లో బహిర్గతం చేసింది. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె డిమాండ్ చేసింది.
Read Also:Guntur Kaaram Leak: ఇదేమి అభిమానం… వదిలితే సినిమానే లీక్ చేసేలా ఉన్నారు…
Reddit వినియోగదారు @proteincarbs బాధాకరమైన సంఘటనను పంచుకున్నారు. సాధారణంగా ప్రతిరోజు తాను కాలేజీకి వెళ్లేందుకు బస్సు ఎక్కే వారు. కానీ సోమవారం మెట్రోను ఎంచుకున్నారని చెప్పారు. ఉదయం 8.50 గంటల ప్రాంతంలో మెజెస్టిక్‌లో మెట్రోలో భారీగా జనం ఎక్కడంతో తోపులాటలు జరిగాయి. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు బాధ్యత వహించే మహిళ.. పెద్ద సంఖ్యలో ప్రజలను రైలు లోపలికి అనుమతించిందని వినియోగదారు తెలిపారు. కొంతసేపటి తర్వాత తన స్నేహితురాలికి చాలా అసౌకర్యంగా అనిపించడం ప్రారంభించింది. తన వెనుక నిలబడి ఉన్న ఒక ఎర్రటి చొక్కా ధరించిన వ్యక్తి తనను తాకినట్లు అనిపించింది.
Read Also:Meenaakshi Chaudhary: కాటుక కన్నులతో కవ్విస్తున్న.. మీనాక్షి చౌదరి
తన వెనుక నుండి ఆమెను గట్టిగా పట్టుకున్నాడని వెంటనే గ్రహించింది. అతను ఆమెను గోర్ల సాయంతో రక్కుతున్న ఫీలింగ్ తెచ్చుకుంది. ఏమి జరుగుతుందో మొదట అర్థం కాలేదు. తిరిగి అతడిని చూసిన వెంటనే వాడు పరుగు లంఖించుకున్నాడు. ఆ రాక్షసుడు చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఆమె సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఆమె పోస్టుపై కామెంట్స్ చేశారు.. మెట్రో లోపల లేదా స్టేషన్‌లో CCTV కెమెరాలు ఉన్నాయా? నేను ఫుటేజీని ఎక్కడ చూడగలను? దయచేసి నాకు సహాయం చేయండి. అంటూ రాసుకొచ్చింది. దీని తర్వాత కొంతమంది BMRCL మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.