Hyderabad: రంగారెడ్డి జిల్లా మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో ఎకో స్పోర్ట్స్ కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీ ముగించుకుని, ఒక స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైనవారు ఐబీఎస్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనలో నిఖిల్, సూర్య తేజ, సుమంత్, రోహిత్ అనే నలుగురు స్నేహితులు మృతి చెందారు. నక్షత్ర అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది.
READ MORE: Nani: నాని లైనప్‌లో మరో క్రేజీ మూవీ..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్య తేజ బీబీఏ రెండో సంవత్సరం, సుమిత్ బీబీఏ మూడో సంవత్సరం, శ్రీ నిఖిల్ బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నారు. రోహిత్ ఎంజీఐటీ విద్యార్థిగా గుర్తించారు. గాయపడిన నక్షత్ర బీబీఏ మూడో సంవత్సరం విద్యార్థిని. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
READ MORE: Off The Record : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుపై నెగిటివ్ టాక్..
