Neru : ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ మూవీ నేరు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నేరు’.డిసెంబర్ 21 వ తేదీన థియేటర్లలో విడుదల అయి బ్లాక్‍బాస్టర్ అయింది.కేరళ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. తక్కువ బడ్జెట్ లోనే రూపొందిన నేరు మూవీకి సుమారు రూ.85కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఈ మూవీ పై ప్రశంసలు కూడా భారీ గా వచ్చాయి. ఇప్పుడు, ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చింది. థియేటర్లలో మలయాళం లో మాత్రమే రిలీజైన నేరు.. ఓటీటీలోకి తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ‘నేరు’ సినిమా నేడు (జనవరి 23) స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. మలయాళం తో పాటు తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడల్లోనూ ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. దీంతో ఈ మూవీకి ఓటీటీలో మంచి ఆదరణ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి..
మలయాళంలో సూపర్ టాక్ రావటంతో ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఐదు భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్ లో నేరు చిత్రం అడుగుపెట్టింది.నేరు సినిమాను దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. గతంలో మోహన్ లాల్‍తో జీతూ తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని ఇతర భాషల్లోకి కూాడా రీమేక్ అయ్యాయి. ఇప్పుడు మోహన్ లాల్ – జీతూ జోసెఫ్ మళ్లీ ‘నేరు’తో బ్లాక్‌బాస్టర్ సాధించారు. ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి జీసెఫ్‍తో పాటు శాంతి మాధవి రచయితగా వ్యవహరించారు.నేరు చిత్రంలో అనాశ్వర రాజన్, ప్రియమణి, శాంతి మహదేవి, సిద్ధిఖీ, జగదీశ్, కేబీ గణేశ్ కుమార్, శంకర్, మాథ్యూ వర్గీస్ మరియు హరిత నాయర్ కీలక పాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. విష్ణు శ్యాం సంగీతం అందించారు
Also Read
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
తాజావార్తలు
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!