Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేలా 65 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
జర్మనీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌లాల్.. ప్రేక్షకుల కోసం పలు పాటలకు స్టెప్పులు వేశారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘మనోహరి’కి ఆయన చేసిన డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఇద్దరు నటీమణులతో కలిసి స్టేజ్‌పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఒరిజినల్‌గా ఈ పాటలో ప్రభాస్ ముగ్గురు నటీమణులతో కలిసి కనిపించగా.. మోహన్‌లాల్ మాత్రం ఇద్దరు నటీమణులతో కలిసి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. బాహుబలి చిత్రంలోని కాస్ట్యూమ్స్‌ను గుర్తుకు తెచ్చేలా రూపొందించిన దుస్తుల్లో ఈ ప్రదర్శన మరింత ప్రత్యేకంగా నిలిచింది.
Also Read
కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా.. ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్ కొన్ని పాటలు కూడా పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆయన ఉత్సాహం, స్టేజ్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్టెప్పులు చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మనోహరి’ పాటకు మోహన్‌లాల్ వేసిన స్టెప్పులు చూసి ప్రభాస్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి’ పాటలు భాషా భేదం లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయని.. ఇప్పుడు మోహన్‌లాల్ పర్ఫార్మెన్స్తో ఆ పాటకు మరోసారి కొత్త క్రేజ్ వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
#MohanLal – DANCE WITH TWO ACTRESS FOR BAAHUBALI SONG – From #Prabhas Film 😜😜💥💥pic.twitter.com/UYdLnP8AxQ
— GetsCinema (@GetsCinema) June 27, 2026
Lalettan grooving with #SaniyaAyaippan n #Swasika 💃🕺is taking over the social media all over 💥#Mohanlal pic.twitter.com/x3DhMYsoKW
— Mirsah Vc (@Mhdmirsahvc) June 27, 2026
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!