Site icon NTV Telugu

Mohanlal: సినిమాల్లోకి వాళ్లు వస్తారని అనుకోలేదు: మోహన్‌లాల్

Mohanlal

Mohanlal

Mohanlal: తానూ ఊహించని రీతిలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానంటూ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. తన కూతురు విస్మయ నటిస్తున్న తొలి సినిమానే ‘తుడక్కమ్‌’ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ్న్నారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. తన పిల్లలు సినిమాల్లోకి వస్తారని తానెప్పుడూ అనుకోలేదని చెప్పారు. తన పిల్లలకు కెరీర్‌ విషయంలో స్వేచ్ఛ ఇచ్చానని వెల్లడించారు. సినిమాల్లో నటించడం అనుకున్నంత సులువు కాదని ఆయన అన్నారు. కానీ తన కూమార్తె విస్మయ నటిని కావాలని నిశ్చయించుకోవడంతో ఆమెకు కావాల్సిన సపోర్ట్‌ ఇచ్చామని చెప్పారు. తను మంచి కథతో సినిమా రంగంలోకి వస్తోందని అన్నారు.

READ ALSO: Snapdragon 8 Elite చిప్‌, 7500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో iQOO Neo11 లాంచ్..!

సినిమాల్లో నటించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని మోహన్‌లాల్ చెప్పారు. తాను నటుడిని కావడం విధి అని వెల్లడించారు. ప్రేక్షకులు గత 48 ఏళ్లుగా తనను ఆదరిస్తున్నారని, కేవలం వారి వల్లే తానీ స్థాయిలో ఉన్నానని చెప్పారు. తన పిల్లల విషయానికొస్తే వారికంటూ కొన్ని లక్ష్యాలున్నాయని, వారి అభిప్రాయాలను తాను గౌరవించేవాడిని చెప్పారు. అనంతరం మోహన్‌లాల్‌ సతీమణి సుచిత్ర మాట్లాడుతూ.. తమ కుటుంబానికి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమని చెప్పారు. మోహన్‌లాల్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకోవడం, తనయుడు ప్రణవ్‌ కొత్త సినిమా విడుదల కాబోతుండటం (ఈ నెల 31న రిలీజ్‌ కానున్న డియాస్‌ ఇరాయ్‌), తనయ విస్మయ నటిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. విస్మయ నటిస్తున్న కొత్త సినిమాకు ‘2018’ సినిమా ఫేమ్‌ జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

READ ALSO: Baahubali The Eternal War: 2027లో థియేటర్స్‌లోకి జక్కన్న కొత్త సినిమా..

Exit mobile version