Odisha: ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ..
- డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్ డియో.. ప్రవతి పరిదా
- ప్రకటించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిని భాజపా ఖరారు చేసింది. మోహన్ మాఝీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదాను ఉప ముఖ్య మంత్రులుగా ఖరారు చేసింది. ఒడిశాలోని కియోంజర్ నియోజకవర్గం నుంచి మోహన్ మాఝీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంన్నికయ్యారు. ఇటీవల ముగిసిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో కూడా కియోంజర్ అసెంబ్లీ స్థానాన్ని మాఝీ గెలుచుకున్నారు. బిజు జనతా దళ్‌కు చెందిన మినా మాఝీని 11,577 ఓట్లతో ఓడించారు. సీఎం ఎంపికను పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌లను నియమించారు. రాజ్‌నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్ మంగళవారం రాష్ట్ర నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని రాజ్ నాథ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు.
READ MORE: Alleti Maheshwar Reddy: ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదు..
Also Read
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
రాజ్ నాథ్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “మోహన్ మాఝీని ముఖ్యమంత్రిని చేయాలని చేతులెత్తి వారిలో మొదటగా కేవీ సింగ్ ఉన్నారు. తనను సీఎం చేయాలనే నిర్ణయాన్ని మిగతా ఎమ్మెల్యేలందరూ చప్పట్లు కొట్టి స్వాగతిస్తున్నారు. అందువల్ల ఒడిశా బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా మోహన్ మాఝీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.” అని పేర్కొన్నారు.
ఒడిశాలో మొత్తం 147 స్థానాలకు గాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి సొంతంగా మెజారిటీ పొందింది. ఒడిశా నుంచి ఆ పార్టీ ఎంపీగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌ను బీజేపీ సీఎం చేయవచ్చని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయినా కేంద్రంలో విద్యాశాఖ మంత్రిని చేశారు. దీని తరువాత, అందరి చూపు ఒడిశాపై పడింది. తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీకి వచ్చిన బ్రజరాజ్‌నగర్ ఎమ్మెల్యే సురేష్ పూజారి పేరు కూడా తెరపైకి వచ్చింది.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!