Site icon NTV Telugu

Manchu Vishnu: ఇక స్వచ్ఛత పైనే మోహన్ బాబు వర్శిటీ ఫోకస్

Vishnu Manchu

Vishnu Manchu

ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజ్ యాజమాన్యాలు పరిసరాలు శుభ్రంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే దేశం మొత్తం శుభ్రంగా ఉంటుంది. మొదట మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రారంభించాం.. ఇది ఇక్కడితో ఆగదు అన్నారు నటుడు మంచు విష్ణు. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీలో స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశ గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మంచు విష్ణు . ఆయన జయంతి రోజున ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి, మోహన్ బాబు యూనివర్సిటీలోని 20 వేల మంది విద్యార్థులతో చెత్త సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. భారతీయులు విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతం చాలా డర్టీగా ఉండడం బాధాకరమైన విషయం.

ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లిన వాళ్లు ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవపోవడం వల్ల ఇండియాకు మచ్చ తీసుకొస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యతో పాటు దేశభక్తిని నేర్పిస్తున్నాం. రిపబ్లిక్ డే, ఇండిపెండెంట్ డే రోజున మాత్రం దేశభక్తి పాటించడం చేయకూడదు. మార్పు తీసుకురావడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అన్నారు మంచు విష్ణు. మోహన్ బాబు యూనివర్సిటీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని 20వేల మంది విద్యార్థులతో చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబియు ఛైర్మన్ మంచు మోహన్ బాబు, సిఈఓ మంచు విష్ణు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు.

Read Also: Hardik Pandya: రాసి పెట్టుకోండి.. రెండేళ్లలో అతడు తురుపుముక్క అవుతాడు

షాపుల యజమానులపై మోహన్ బాబు ఫైర్ అయ్యారు. ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు స్వచ్చ భారత్ పాటించాలంటున్నారు‌. చెత్త తరలించేందుకు స్థలం చూపాలని ప్రభుత్వాన్ని కోరినా సమాధానం లేదు. కాలేజ్ పై ఆధారపడి 100కు పైగా హాస్టల్స్ ఉన్నాయి. రోడ్డు వేసి, ప్లాట్ ఫామ్ కట్టి, చెత్త బుట్టలు ఇస్తే చెత్తను రోడ్లు పై వేస్తున్నారు. చెత్త రోడ్డుపై వేసే షాపుల యజమానులకు వార్నింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. నెలకు ఒకటి రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని చేపడతాం అన్నారు మంచు విష్ణు.

Read Also: Hardik Pandya: రాసి పెట్టుకోండి.. రెండేళ్లలో అతడు తురుపుముక్క అవుతాడు

Exit mobile version