NTV Telugu Site icon

CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన మోహన్ బాబు, దిల్ రాజు

Cm Revanth

Cm Revanth

తెలంగాణ సీఎం రేవంత్ ను ఈరోజు సినీ ప్రముఖులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సినీనటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు. ఈ కలయికపై మంచి విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడం ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి నుంచి చాలా ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవడం, చర్చించడం చాలా అద్భుతంగా ఉంది.

READ MORE: PM Modi: ప్రధాని మోడీకి మారిషన్ అత్యున్నత పురస్కారం.. 21 అంతర్జాతీయ పురస్కారం..

మన రాష్ట్రం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ఆయన అందిస్తున్న తిరుగులేని మద్దతు, చూపుతున్న నిబద్ధతను అభినందిస్తున్నాము అని ఆయన అన్నారు. ఇక మరోపక్క ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. గద్దర్ తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధివిధానాలను ముఖ్యమంత్రి ఆమోదించిన నేపథ్యంలో దిల్ రాజు కలిశారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

READ MORE: US-Ukraine Peace Talks: సౌదీ వేదికగా అమెరికా-ఉక్రెయిన్ శాంతి చర్చలు..