Mohammed Siraj: ఇంగ్లండ్‌పై ఐదో టెస్ట్‌లో భారత జట్టు అద్భుత విజయానంతరం, పేసర్ మహ్మద్ సిరాజ్ వ్యక్తిగత మోటివేషన్ ముచ్చటను మీడియాతో పంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సిరాజ్.. చివరి రోజు ఉదయాన ‘బిలీవ్ (Believe)’ అనే పదాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసి, దొరికిన ఫోటోను తన ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నట్లు తెలిపాడు. అదే తనకు ప్రేరణగా మారిందని పేర్కొన్నాడు.
ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతను మాట్లాడుతూ.. నిజంగా అద్భుతంగా అనిపిస్తోంది. మొదటి రోజు నుంచే జట్టు మొత్తం గట్టిగా పోరాడింది. ఫలితంగా ఈ విజయాన్ని సాధించాం. నా ప్లాన్ చాలా సింపుల్. బంతిని ఒకే పాయింట్‌పై పడ్డేలా చూస్తాను. ఎక్కువగా ట్రై చేస్తున్న. అలా చేస్తే అవే వికెట్లు వస్తాయి. ప్రెషర్ కూడా ఏర్పడుతుంది. ఉదయం లేచినపుడే నాకో విశ్వాసం వచ్చింది.. అదే నేను సాధించగలనన్న నమ్మకం. గూగుల్‌లో ‘I can do it’ అని సెర్చ్ చేసి దాన్ని నా వాల్‌పేపర్ చేశా అంటూ చెప్పుకొచ్చాడు సిరాజ్.
Crime News: భార్యను ఇటుకతో చంపిన భర్త.. 20 ఏళ్ల తర్వాత అరెస్ట్!
ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తంగా 9 వికెట్లు ఖాతాలో వేసుకుని భారత విజయానికి కీలకంగా నిలిచాడు. అయితే హ్యారీ బ్రూక్ క్యాచ్‌ను డ్రాప్ చేసిన తన తప్పును కూడా అతను అంగీకరించాడు. అది మ్యాచ్‌ను ప్రమాదంలోకి నెట్టిన మలుపు అని వివరించాడు. ఆ క్యాచ్ నేనప్పుడే పట్టుకొని ఉండి ఉంటే మేము ఈ రోజు బహుశా ఆడాల్సిన అవసరం లేకపోయేదని వ్యాఖ్యానించాడు. కానీ బ్రూక్ నిజంగా అద్భుతంగా ఆడాడు. ఫుల్ క్రెడిట్ ఇవ్వాలని అతడిని అభినందించాడు.
Tollywood: తెలుగు సినిమాల్లో పనిచేయాలని ఉందా.. మీకు ఇదే గోల్డెన్ చాన్స్!
అలాగే లార్డ్స్‌లో టీమిండియా ఎదుర్కొన్న ఓటమిని గురించి మాట్లాడుతూ, అది గుండెను బాధించే ఓటమి అని పేర్కొన్నాడు. ఆ సమయంలో జడేజా తనకు ఇచ్చిన సలహాను కూడా గుర్తు చేశాడు. జడూ అన్నా నన్ను పక్కకి తీసుకుని స్ట్రైట్ బ్యాట్‌తో ఆడు, బంతిని సరిగ్గా మిడ్‌లో కొట్టు అని చెప్పాడు. నా నాన్నకోసం, ఆయన చేసిన కష్టాన్ని గుర్తుంచుకోమన్నాడు. ఆ మాటలు నన్ను మెంటల్ గా బలంగా నిలిపాయని వెల్లడించాడు.
