NTV Telugu Site icon

Mohammed Shami Suicide: 19వ అంతస్తు నుంచి దూకి.. షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు!

Mohammed Shami Suicide

Mohammed Shami Suicide

Umesh Kumar Revelas Mohammed Shami’s Suicide Incident: టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ జీవితంలో 2018లో పెను తుపానే వచ్చింది. భార్య హసీన్ జహాన్ పెట్టిన గృహహింస కేసు, ఫిక్సింగ్‌ ఆరోపణలు అతడి కెరీర్‌ను కుదిపేశాయి. కొద్ది రోజులకే ఫిక్సింగ్‌ ఆరోపణల నుంచి షమీ బయటపడ్డాడు. అయితే ఆ సమయంలో షమీ ఎంతో మనోవేదనకు గురయ్యాడట. దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలను సహించలేని అతడు ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని షమీ స్నేహితుడు ఉమేశ్‌ కుమార్ తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పాడు.

ఉమేశ్‌ కుమార్ మాట్లాడుతూ… ‘2018లో మహమ్మద్‌ షమీని ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో మా ఇంట్లోనే ఉన్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు రావడంతో ఎంతో కుమిలిపోయాడు. నేను అన్నింటినీ సహించగలను కానీ నా దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలను మాత్రం సహించలేనని షమీ నాతో అన్నాడు. దాంతో ఏదో కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాడని నాకు అర్ధమైంది. ఓ రోజు తెల్లవారుజామున 4 గంటలకు మంచి నీళ్లు తాగడానికి గదిలోంచి బయటకు రాగా.. 19వ అంతస్తులో ఉన్న మా ఇంటి బాల్కనీలో ఉన్నాడు. ఏం జాఱఁగఁగఁబోతుందో నాకు అర్థమైంది. వెంటనే లోపలికి తీసుకెళ్లా. ఆ రాత్రిని మరచిపోలేము’ తెలిపాడు.

Also Read: Bigg Boss-Amrutha Pranay: బిగ్‌బాస్‌లోకి అమృత ప్రణయ్!

‘ఆ ఘటన తర్వాత మేం మాట్లాడుకుంటున్నప్పుడు ఫిక్సింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న కమిటీ నుంచి మహమ్మద్‌ షమీకి క్లీన్ చిట్ మెసేజ్ వచ్చింది. ఆ రోజు చాలా ఆనందపడ్డారు. ప్రపంచకప్ గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషించాడు. అనంతరం కెరీర్‌పై దృష్టి పెట్టాడు’ అని ఉమేశ్‌ కుమార్ చెప్పాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో షమీ అదరగొట్టిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ అనంతరం చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అతడు ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచకప్‌ 2024కు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న షమీ.. పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు.

Show comments