Mohammad Kaif: పాకిస్థాన్ కోచ్‌పై కైఫ్ ఫైర్.. “భారతీయుడిని కోచ్‌గా నియమించుకోండి” అంటూ సెన్సేషనల్ కామెంట్స్!

Mohammad Kaif

Mohammad Kaif

Mohammad Kaif: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలవ్వడంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పాక్ కోచ్ మైక్ హెస్సన్ అనుసరించిన వ్యూహాలపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ నిప్పులు చెరిగారు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్, భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని కైఫ్ మండిపడ్డారు.

READ ALSO: NASA: కల్పనా చావ్లా లాగే సునీతా విలియమ్స్‌‌కు జరిగేదా.. నాసా సంచలన రిపోర్ట్..

ఈ సందర్భంగా మొహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. “స్లో పిచ్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఏంటి? హెస్సన్ ఫ్రీగా డబ్బులు తీసుకుంటున్నారా?” అంటూ కైఫ్ ఘాటుగా ప్రశ్నించారు. పాక్ జట్టు కొత్త కెప్టెన్ సల్మాన్ అఘాకు అనుభవం లేకపోయినా, అనుభవజ్ఞుడైన కోచ్ సరైన సలహాలు ఇవ్వడంలో విఫలమయ్యారని విమర్శించారు. సాధారణంగా లెగ్ స్పిన్నర్లను పవర్‌ప్లే తర్వాత (6 ఓవర్ల తర్వాత) బౌలింగ్‌కు దించుతారు. కానీ, పాకిస్థాన్ అబ్రార్ అహ్మద్‌ను 4వ ఓవర్‌లోనే రంగంలోకి దించి తప్పు చేసిందని కైఫ్ అభిప్రాయపడ్డారు. కొత్త బంతితో లెగ్ స్పిన్ వేయడం కష్టమని, దానివల్ల రన్లు ఎక్కువగా వచ్చాయని, ఆ తర్వాత ఆ బౌలర్‌ను జట్టు నుంచి తొలగించడం దారుణమని అన్నారు. విదేశీ కోచ్‌ల కాలం చెల్లిపోయిందని, వారు కేవలం పేపర్ మీద రాసుకున్న ప్లాన్లనే నమ్ముకుంటారని కైఫ్ ఎద్దేవా చేశారు. “పాకిస్థాన్ ఇకనైనా మారాలి. విదేశీయులను వదిలేసి, ఒక భారత కోచ్‌ను నియమించుకోవాలి. టీ20 క్రికెట్ అనేది ప్రతి ఓవర్‌కు మారుతుంటుంది, దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకునే కోచ్ పాక్‌కు అవసరం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి కెప్టెన్లు కోచ్‌తో కలిసి వ్యూహాలు రూపొందిస్తారు. వాళ్లు A, B, C, D లను ప్లాన్ చేసి, పరిస్థితికి అనుగుణంగా వాటిని మారుస్తారు” అని చెప్పారు.

READ ALSO: Actor Sivaji: మహిళల డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ వివరణ.. “ఆ పదాలు వాడకుండా ఉండాల్సింది!”