NTV Telugu Site icon

PM Modi Japan Visit: మోడీ జపాన్ పర్యటన.. అణుదాడిలో మరణించిన వారికి నివాళి

Pm Modi

Pm Modi

PM Modi Japan Visit: జీ7 సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మోడీ జపాన్ వెళ్లారు. తొలిరోజు మోడీ బిజీబిజీగా గడిపారు. హిరోషిమాలో జాతి పిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జీ7 దేశాల సమావేశంలో పాల్గొని మోదీ ప్రసంగించారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతోనూ మోదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిగా కొనసాగుతున్న యుద్ధ పరిష్కారానికి భారత్ కృషి చేస్తుందని మోదీ హామీ ఇచ్చారు. రెండోరోజు జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.హిరోషిమాలో దాదాపు 78ఏళ్ల క్రితం అణుబాంబు దాడి జరిగింది. ఆ ప్రదేశానికి ప్రధాని మోదీ జీ7 దేశాల నాయకులతో కలిసి సందర్శించారు.

Read Also:Surya Stotra: ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఏ సమస్యలు మీ దరి చేరవు

ఈ సందర్భంగా హిరోషిమా పీస్ మెమోరియల్ వద్ద అణుబాంబు దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఆ తరువాత పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడ డాక్యుమెంట్ చేయబడిన ఎగ్జిబిట్ లను పరిశీలించి, సందర్శకుల పుస్తకంపై మోదీ సంతకం చేశారు. ప్రధాని మోదీతో పాటు పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించిన వారిలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండోరోజు హిరోషిమాలో మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ ను కలుస్తారు. ఆ తర్వాత భారతదేశ పసిఫిక్ దీవుల సహకార సదస్సులో పాల్గొనడానికి పాపువా న్యూ గినియాకు మోదీ బయలుదేరి వెళ్తారు. ఇదిలాఉంటే శనివారం యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్ స్కీ‌ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విజ్ఞప్తి చేశారు. యుక్రెయిన్ దేశాన్ని సందర్శించాలని ఆయన కోరారు.

Read Also:Thunderstorm and Rain: ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు..!

Show comments