Site icon NTV Telugu

ASEAN Summit: కౌలాలంపూర్ లో ఆసియన్ సదస్సు.. వర్చువల్ గా పాల్గొననున్న మోడీ

Untitled Design (1)

Untitled Design (1)

ASEAN Summit: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆసియాన్ సదస్సు జరగనున్నది. ప్రతి ఏటా ఈ సదస్సుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈసారి హాజరవుతారు. కానీ ఈసారి ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని.. కేవలం వర్చువల్ గా హాజరవుతానని ఎక్స్ లో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా భేటీ రద్దు అయినట్లు సమాచారం. ట్రంప్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగే 22వ ఆసియాన్ – ఇండియా సమ్మిట్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ , ఆసియాన్ నాయకులు సంయుక్తంగా ఆసియాన్-భారత్ సంబంధాలలో పురోగతిని సమీక్షిస్తారని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి చొరవలను చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసియాన్‌తో సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ దార్శనికతకు కీలక స్తంభమని పేర్కొంది. ఈ నిర్ణయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీకి సాధ్యమయ్యే ద్వైపాక్షిక భేటీపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మొదట్లో ప్రధాని మోదీ కౌలాలంపూర్‌తో పాటు కంబోడియాలో కూడా పర్యటించాలనుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ సదస్సుకు వెళ్లకపోవడత.. కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది.

ఈ సమ్మిట్ లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ భారత దేశానికి ప్రాతినిద్యం వహించనున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీయే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఫోన్‌లో ఆత్మీయ సంభాషణ జరిపిన అనంతరం.. మోదీ మలేసియాకు ఆసియాన్ ఛైర్మన్‌షిప్ లభించినందుకు అభినందించారు. “ఆసియాన్-ఇండియా సదస్సుకు వర్చువల్‌గా హాజరు అయ్యేందుకు ఎదురు చూస్తున్నాను. ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నాను” అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version