Site icon NTV Telugu

Modi: దేశానికి సేవ చేసేందుకే మళ్లీ ప్రజలు ఆశీర్వదించారు

Pm

Pm

దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును ఎన్డీఏ నేతలు భేటీ అయి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. అందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్రపతితో భేటీ అనంతరం మోడీ మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చే ఎంపీల జాబితాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అందజేసినట్లు తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ ఉత్సవాల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు అని తెలిపారు. దేశ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. మరింత ఉత్సాహంగా పని చేస్తామని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరినట్లు వెల్లడించారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తామని రాష్ట్రపతికి తెలియజేసినట్లు మోడీ తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: ప్రధాని మోడీకి తైవాన్ అభినందనలు.. ఉడికిపోతున్న చైనా..

ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం భారత ప్రధానిగా మూడో సారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక కేబినెట్ బెర్త్‌లపై కూడా చర్చ జరుగుతోంది. ఆ లిస్టు కూడా రాష్ట్రపతికి అందజేయనున్నారు.

ఇది కూడా చదవండి: Porn addiction: పోర్న్‌కి బానిసలవుతున్న అమెజాన్ జంగిల్ తెగలు.. ఎలాన్ మస్క్ కారణం..

శుక్రవారం ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ పక్షనేతగా మోడీని ఎన్నుకున్నారు. ఎన్డీఏలో జనతాదళ్-యునైటెడ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జనతాదళ్ సెక్యులర్, శివసేన, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ దళ్ మరియు ఇతర పార్టీలు ఉన్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్‌ 272కు బీజేపీ దూరమైంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల మద్దతు అవసరం. కూటమి సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం 293కు చేరింది. ఇక ఇండియా కూటమి 232 సీట్లు సాధించింది.

Exit mobile version