Site icon NTV Telugu

Modi Magic on X: ఎక్స్‌లో మోడీ మ్యాజిక్… టాప్ 10లో 8 ప్రధానివే!

Modi Magic On X

Modi Magic On X

Modi Magic on X: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ఇటీవల కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ దేశాల వారీగా గత నెలలో అత్యధిక లైక్‌లు సాధించిన ట్వీట్‌లను చూపిస్తుంది. ఇందులో భాగంగా భారత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలనం సృష్టించారు. గత 30 రోజుల్లో ఇండియాలో అత్యధిక లైక్‌లు పొందిన టాప్ 10 ట్వీట్‌లలో ఏకంగా 8 ప్రధాని మోదీ చేసిన పోస్టులే కావడం విశేషం. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ టాప్ 10లో మరే ఇతర రాజకీయ నాయకుడూ లేకపోవడం.

READ ALSO: Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక అల్లర్లు.. మీడియా, బంగ్లా జాతిపిత ఇంటిపై దాడులు ఎందుకు..?

ఎక్స్ ప్లాట్‌ఫాం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల్లో గత నెలలో అత్యధిక లైక్‌లు సాధించిన ట్వీట్‌లను వినియోగదారులు చూడవచ్చు. ఈ కొత్త ఫీచర్‌లో భాగంగా ఇండియాలో గత 30 రోజుల డేటా ప్రకారం.. ప్రధాని మోడీ ట్వీట్‌లు టాప్ 10 ఏకంగా 8 స్థానం సంపాదించుకొని సంచలనం సృష్టించాయి. ఉదాహరణకు అత్యధిక లైక్‌లు సాధించిన ప్రధాని ట్వీట్… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భగవద్గీత రష్యన్ అనువాదాన్ని ప్రధాని మోడీ అందజేస్తున్న ఫోటోతో పోస్ట్ చేసినది. ఇది ఎక్స్ వేదికగా లక్షలాది లైక్‌లను సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియా విశ్లేషకులు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ట్వీట్‌లు వివిధ అంశాలపై స్ఫూర్తిదాయకంగా ఉండటమే ఎక్స్‌లో టాప్ 10 మోస్ట్ లైక్ ట్వీట్స్‌లో ఏకంగా 8 ఉండటానికి కారణమని అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోడీ పోస్టులు దేశాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం, అంతర్జాతీయ సంబంధాలు, యువతకు సందేశాలు… వంటి టాపిక్‌లపై ఉండటంతో ప్రజలు ఎక్కువగా వాటితో కనెక్ట్ అవుతున్నారని తెలిపారు. టాప్ 10లో ఇతర రాజకీయ నాయకులు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇది ప్రధాని మోడీ వ్యక్తిగత బ్రాండింగ్, డిజిటల్ స్ట్రాటజీలకు తిరుగులేని ఉదాహరణగా చెప్పకనే చెబుతోందని వారు అభిప్రాయపడ్డారు.

READ ALSO: RGV Dhurandhar Review: ‘ధురంధర్‌’పై ఆర్జీవీ స్పెషల్ రివ్యూ..

Exit mobile version