NTV Telugu Site icon

UP Minister: మోడీ భగవంతుడి అవతారం.. జీవించి ఉన్నంతకాలం ప్రధానిగా ఉండగలరు

Modi Like Avatar

Modi Like Avatar

UP Minister: ఉత్తరప్రదేశ్‌ మంత్రి గులాబ్‌దేవి ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ భగవంతుడి అవతారమని, ఆయన కోరుకున్నంత కాలం ఆయన పదవిలో కొనసాగవచ్చని ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి బుధవారం అన్నారు. బుధవారం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిని చేయాలని కొందరు విపక్ష నేతలు ఎందుకు అంటున్నారని విలేఖరులు ప్రశ్నించగా ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

Bharat Jodo Yatra: పాదయాత్రలో డోలు వాయించిన రాహుల్‌ గాంధీ..

“మోదీజీ అవతార పురుషుడి లాంటివాడు. ఆయన అసాధారణమైన ప్రతిభ ఉన్న వ్యక్తి. వారితో ఎవరూ పోటీపడలేరు. ఆయన కోరుకుంటే జీవించి ఉన్నంత వరకు ప్రధానిగా ఉండగలరు” అని చందౌసి ఎమ్మెల్యే ఇక్కడ ఒక కార్యక్రమం తర్వాత విలేకరులతో అన్నారు. దేవుడే తన ప్రతినిధిగా మోడీని పంపారన్నారు. ఊహాగానాలతో ఏమి జరగదని గులాబ్‌ దేవి అన్నారు. ప్రజలకు ఏది ఇష్టమో అది చేసేలా మోదీ చేస్తారని మంత్రి అన్నారు. “దేశం మొత్తం ఆయన మాటలను అనుసరిస్తుంది. ఒక వ్యక్తి గొప్పదనానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి.” అని మంత్రి అన్నారు.