Jeevan Reddy: జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఉన్నత వర్గాలకు రిజర్వేషన్ తెచ్చింది మోడీ.. దేశంలో వెనుకబడిన వర్గాలను విస్మరించి సమాజంలో ఉన్నత వర్గాలకు EWS రిజర్వేషన్ కల్పించింది మోడీ ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు. మోడీ EWSలో ముస్లిం ఉన్నత వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు.. దేశంలో మత ప్రతిపాదకన హిందూ -ముస్లింల మధ్య ప్రధాని మోడీ చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. స్వతహాగా రాజకీయంలో ఎదిగిన వ్యక్తిని నేను.. దేశ సమగ్రత కొరకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.. బలహీన వర్గాల రిజర్వేషన్లు తీసి వేసి రాజ్యాంగని మార్చే కుట్ర చేస్తున్నారని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Gold Price Today : గుడ్ న్యూస్.. నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు..
యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీ, 370 ఆర్టికల్ పై మా పార్టీ విధానమే నా విధానం అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. మోడీ అభిప్రాయాన్ని ధర్మపురి అరవింద్ వ్యక్తపరుస్తున్నాడు.. అరవింద్ కి అభివృద్ధిపై మాట్లాడడం చేతకాదు.. మోడీ అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి అరవింద్ ఎవరు అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా నాకు అండగా నిలవండి.. జగిత్యాల గౌరవం నిలబడేలా పని చూపిస్తాను అని జీవన్ రెడ్డి వెల్లడించారు.