Site icon NTV Telugu

Lalu Prasad Yadav: మోడీ ప్రభుత్వంపై లాలూ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Mde

Mde

మోడీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోడీ సర్కార్ బలహీనంగా ఉందని.. ఆగస్టులో కూలిపోవచ్చని జోస్యం చెప్పారు. ఆర్జేడీ పార్టీ స్థాపించి 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాట్నాలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాలూ ప్రసాద్, తనయుడు తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: UK: యూకే నూతన ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం

ఆర్జేడీ వేడుకల్లో పాల్గొన్న లాలూ ప్రసాద్.. మోడీ సర్కార్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్‌కు ఆగస్టు సంక్షోభం రావొచ్చని పేర్కొన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ మెరుగైన ఫలితాలు సాధించిందని.. ఓట్ల శాతాన్ని కూడా మెరుగుపరుచుకుందని తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అస్వస్థత కారణంగా లాలూ సభలో ఎంతో సేపు మాట్లాడలేకపోయారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ‘కల్కి’లో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్!

 

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ 293, ఇండియా కూటమి 233 సీట్లు సాధించాయి. బీజేపీకి సొంతంగా 240 సీట్లే వచ్చాయి. మిత్రపక్షాల సపోర్టుతో మోడీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

 

Exit mobile version