Prime Minister Narendra Modi: 2020లో జరిగిన గాల్వాన్ వివాదం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారి చైనాకు వెళ్లనున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని చైనాను సందర్శించనున్నారు. అమెరికా సుంకాల వేళ మోడీ చైనా పర్యటన ప్రపంచ దేశాల్లో ప్రాముఖ్యతను సంతరించుకొంది. టియాంజిన్ నగరంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరుగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని చైనా, భారత ప్రధానమంత్రిని ఆహ్వానించింది.
READ MORE: Rahul Gandhi: రాహుల్‌కి ఈసీ సవాల్.. ఫైర్ అయిన ప్రియాంక గాంధీ
ఏడేళ్ల తర్వాత మొదటిసారి..
టియాంజిన్ నగరంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరుగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాన్, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజాన్, తజికిస్థాన్ వంటి దేశాల అగ్ర నాయకులు రానున్నట్లు SCO అధ్యక్షురాలు తెలిపారు. ప్రధాని మోడీ పర్యటనపై చైనా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ SCO శిఖరాగ్ర సమావేశం టియాంజిన్లో జరుగుతుందని ధ్రువీకరించారు. అన్ని SCO సభ్య దేశాల నాయకులు, 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని, ఇది SCO చరిత్రలో అతి పెద్ద, అత్యంత గొప్ప శిఖరాగ్ర సమావేశం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని దేశాల సహకారంతో ఈ శిఖరాగ్ర సమావేశం ఐక్యత, స్నేహం, సానుకూల ఫలితాలకు చిహ్నంగా మారబోతుందని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా చైనా, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించిందని, ఆయనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ చైనా పర్యటనకు వెళ్తే… ఏడేళ్ల తర్వాత మొదటిసారి చైనా గడ్డపై అడుగుపెట్టినట్లు అవుతుంది. గత కొన్ని రోజులుగా భారత్- అమెరికా మధ్య సంబంధాలలో వివాదం నెలకొంది. అమెరికా సుంకాల కారణంగా 87 బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ప్రత్యక్ష ముప్పులో ఉన్నాయి. అమెరికా సుంకాల కారణంగా ఏర్పడిన కొత్త ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధాని మోదీ, చైనా పర్యటన ప్రపంచ రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటనకు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం అధికారికంగా వెలువడలేదు.
READ MORE: Athadu : త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్.. ఎవరికీ చెప్పకుండా షూటింగ్!
