NTV Telugu Site icon

PM Modi: మాజీ ప్రధానులకు, రాష్ట్రపతులకు మోడీ ఆహ్వానం.. దేనికోసమంటే..!

Moi

Moi

ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. పాత, కొత్త కలిపి మొత్తం 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక సోమవారం మంత్రులకు మోడీ శాఖలు కేటాయించారు. ఇదిలా ఉంటే మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రధానులకు, రాష్ట్రపతులకు ఆహ్వానాలు పంపారు. తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ మేరకు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ. దేవెగౌడ్, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాల కేంద్రమంత్రుల శాఖలు ఇవే

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలు గెలుచుకుంది. దీంతో మూడోసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం జరిగిన ప్రమాణస్వీకారానికి విదేశీ ప్రముఖులు వచ్చారు. ఇక మిత్ర పక్షాలతో కలిపి మొత్తం 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇది కూడా చదవండి: Modi 3.0 Cabinet: కొత్త కేబినెట్‌కు శాఖలు కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖలంటే..