Site icon NTV Telugu

Delhi: ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Cabint

Cabint

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా వర్గాలకు తాయిలాలు ప్రకటించింది. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే సోలార్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అలాగే అన్నదాతలకు కూడా శుభవార్త తెలిపింది. ఎరువుల రాయితీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల రాయితీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐదు రకాల ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీకి ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఎరువుల రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో ఆయా కుటుంబాలకు సహాయంగా ఉంటుందని తెలిపారు. ఈ పథకం కింద నివాస పైకప్పు సౌర సంస్థాపనలకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. మిగులు విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించడం ద్వారా గృహాలు తమ విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చని, అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. 3 KW వ్యవస్థ ఒక గృహానికి సగటున నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలదని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version