PV Narasimha Rao : మాజీ ప్రధాని పివి నరసింహారావును ప్రకటించిన ప్రధాని, మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని భారతరత్నతో సత్కరిస్తున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ పండితుడు, రాజకీయవేత్తగా, నరసింహారావు గారు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత తర్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా వెల్లడించారు.
Read Also:Nail Polish : నెయిల్ పాలిష్ లను ఎక్కువగా మారుస్తున్నారా? ఇది ఒక్కసారి చదవండి..
పీవీ నరసింహారావు పాత వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరలో 1921 జూన్ 28 న జన్మించారు. ఆయన అసలు పేరు పాములపర్తి వేంకట నరసింహారావు.. నాగపూర్ విశ్వవిద్యాలయంలో 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివారు. ఇక తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.
1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగారు. తర్వాత ఆయన రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఐదేళ్ల పరిపాలన పూర్తి చేసిన ప్రధానమంత్రులలో నెహ్రూ, గాంధీల కుటుంబం వెలుపల మొదటి వ్యక్తి పీవీ నరసింహారావు మాత్రమే. పి.వి.నరసింహారావు బహుభాషావేత్త. ఇంగ్లీషు, హిందీతో పాటు 17 భాషలు మాట్లాడగలడు. పీవీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.