Kisan Reddy : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజుల పండుగ సంబరాల్లో ఊరు-వాడ భోగి మంటలు వేసుకుని వేడుకలను మొదలు పెట్టారు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను అలంకరించారు. చిన్న నుంచి పెద్ద వరకు తరతమ బేధం లేకుండా పండుగ సంబరాల్లో మునిగిపోయారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కాగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గాను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. కాగా సాయంత్రం 5 గంటలకు సంక్రాంతి సంబరాలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించనున్నారు.
Read Also:AP Government: వారికి గుడ్‌న్యూస్.. రూ.6,700 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..
ఈ సంక్రాంతి వేడుకల్లో కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, అలాగే వెండితెర మెగాస్టార్ చిరంజీవి, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నేడు జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన జెడ్-మోడ్ టన్నెల్‌ను ప్రారంభించారు. ఈ టన్నెల్ గాందర్‌బల్ జిల్లాలో 12 కిలోమీటర్ల మేర రూ.2,400 కోట్లతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై నిర్మించారు.
Read Also:Uttarpradesh : హోటల్‌లో డాక్టర్ డిజిటల్ అరెస్టు.. రూ.50లక్షలు పోకుండా కాపాడిన పోలీసులు