అక్టోబర్ నెలలోనే అమెరికాలో వాక్సిన్ తీసుకొస్తామని, డిసెంబర్ నాటికి దేశంలో 10 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతంలో వాక్సిన్ డెవలప్ చేస్తున్న కంపెనీలపై ఒత్తిడి లేదని, ట్రయల్స్ పూర్తైన తరువాతే వాక్సిన్ ను రిలీజ్ చేస్తామని కంపెనీలు పేర్కొన్నాయి. అటు సిడిఎస్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు ఆయా కంపెనీలపై ట్రంప్ సర్కార్ ఒత్తిడి తీసుకొచ్చింది. రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో అమెరికన్ కరోనా వాక్సిన్ డెవలప్మెంట్ కంపెనీ వాక్సిన్ పరిశోధనకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను రిలీజ్ చేసింది. నవంబర్ నాటికి వస్తుందో లేదో కంపెనీ వర్గాలు ప్రకటిస్తామని మోడెర్నా కంపెనీ సీఈవో తెలిపారు. అక్టోబర్ నాటికి అసంభవం అని అయన తేల్చేశారు. మోడెర్నా పరిశోధనకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను రిలీజ్ చేసిన కొద్దిగంటలకు ఫైజర్ వాక్సిన్ కంపెనీకూడా బ్లూ ప్రింట్ ను రిలీజ్ చేసింది. మరి ట్రంప్ చెప్పినట్టుగా అక్టోబర్ చివరి నాటికి వాక్సిన్ రిలీజ్ అవుతుందా? తాజా పరిణామాలను బట్టి చూస్తే కష్టమే అనిపిస్తోంది.
ఆ అమెరికన్ కంపెనీలపై భారీ ఒత్తిడి… బ్లూ ప్రింట్ రిలీజ్…
