Site icon NTV Telugu

No Phones : ఉపాధ్యాయులపై విద్యాశాఖ కఠిన నిర్ణయం

No Phones

No Phones

No Phones : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. రూరల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొన్ని సందర్భాల్లో టీచర్లు తరగతులు నిర్వహించకుండా ఫోన్‌లలో మునిగిపోయారని స్థానిక ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు డీఈఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితులు పాఠశాలలపై నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉండటంతో, అడ్మిషన్లపై దుష్ప్రభావం పడే అవకాశాన్ని విద్యాశాఖ ఆందోళనగా చూస్తోంది.

Ram Charan : రామ్ చరణ్ కి అరుదైన గౌరవం.. లండన్ బయలుదేరిన మెగా ఫ్యామిలీ!

ఇందులో భాగంగా, హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్‌లో ఇటీవల ముగిసిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డీఈఓలకు పలు సూచనలు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతుల్లో మొబైల్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. అంతేకాదు, పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు అతిక్రమించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

జూన్ 1 నుంచి 11 వరకు ఉపాధ్యాయులు తమ పాఠశాల పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలను, వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలలో చేర్చించేందుకు ప్రోత్సహించాలి. ఐదు ఏళ్లు నిండిన పిల్లలను బడిబాట పట్టించేలా చేసేందుకు వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అయితే, ఈ ప్రచారం క్రియాశీలంగా సాగకపోవడం కూడా అడ్మిషన్ల తగ్గుదలకు ప్రధాన కారణంగా మారిందని కొంతమంది మాజీ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. తరగతుల్లో ఫోన్ నిషేధంపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులు, అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ అవసరం అని చెబుతుండగా, మరికొందరు విద్యాశాఖ తీసుకున్న ఈ చర్యను సమర్థిస్తున్నారు.

Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్‌.. ఛార్జీలు పెంపు..

Exit mobile version