NTV Telugu Site icon

Talasila Raghuram: లోకేష్ ది అనామక పాదయాత్ర

Talasila Raghuram (1)

Talasila Raghuram (1)

ఏపీలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. టీడీపీ నేత త్వరలో పాదయాత్రకు రెడీ అయ్యారు. లోకేష్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ తలశిల రఘురాం లోకేష్ పాదయాత్రపై హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ పాదయాత్ర ఒక అనామక పాదయాత్ర అని విమర్శించారు. పనికిమాలిన యాత్రలతో అబద్ధాలు చెప్పబోతున్నారు. అప్పట్లో వైసీపీకి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పాదయాత్ర చెయ్యాలని చెప్పారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు.

జగన్ పాదయాత్ర రాత్రి సమయంలో జరగలేదు. ఇదేం ఖర్మ పేరుతో చేపట్టిన యాత్రలు ఏమయ్యాయి? అమరావతి నుంచి అరసవల్లి యాత్ర ఎక్కడుంది? ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కూడా అంతే అని తలశిల రఘురాం దుయ్యబట్టారు. లోకేష్ యాత్రతో ఒరిగేదేం ఉండదన్నారు. ఆ పాదయాత్రకు ఎవరూ భయపడడం లేదని ఇంతకుముందే ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిన పాదయాత్రకు, అనామకుడు లోకేష్ చేసే యాత్రకు చాలా తేడా ఉంది. వెన్నుపోటు పొడిచి చంపేసిన వ్యక్తికి నమస్కారం చేసి యాత్ర ప్రారంభించటం ఏంటి? జగన్ పాదయాత్ర చీకటి ముగిసేసరికి ముగిసేలా జాగ్రత్తలు తీసుకున్నాం.

Read Also: Shubman Gill: సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప..గిల్ తెలివైన సమాధానం

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం. కానీ లోకేష్ మొదటి అడుగు పడకముందే కుట్రలు చేస్తున్నారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం పాదయాత్ర చేస్తే మంచిది. అమరావతి రైతుల పేరుతో చేసిన యాత్ర కూడా మధ్యలోనే ఆగిపోయింది. నిజమైన‌ లక్ష్యంతో యాత్రలు చేస్తేనే సక్సెస్ అవుతాయి. ప్రగల్భాల మాటలను టీడీపీ లీడర్లు మానుకోవాలి.. ఇన్ని మాటలు మాట్లాడేవారు అప్పుడు ఏం చేశారు? అరసవిల్లి వెళ్లకుండా ఇంట్లో ఎందుకు పడుకున్నారు?సెక్యూరిటీ సమస్యలు రాకూడదనే మేము వివరాలు అడుగుతున్నాం అన్నారు.

శాంతియుతంగా పాదయాత్ర చేస్తే అందరూ హర్షిస్తారు. జగన్ ని సైకో అని విమర్శిస్తే ప్రజలు కొడతారు.. జగన్ పాదయాత్ర సమయంలో కూడా ముందు కడప జిల్లా వరకే అనుమతులు ఇచ్చారు..సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే యాత్రలు చేయాలన్నారు. 2019 నుండి మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రజలు వివరిస్తాం. వాటికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు రఘురాం. లోకేష్, పవన్ కళ్యాణ్ తోపాటు ఇంకెవరైనా ఉంటే వారితో కూడా పాదయాత్ర చేయించుకోవచ్చు. అనామకుడు చేసే యాత్రలకు హైప్ క్రియేట్ చేయాల్సిన పనిలేదన్నారు.

Read Also: Ukraine Crisis: నాటోలో తొలగిన విభేదాలు.. ఉక్రెయిన్ చేతికి అత్యాధునిక యుద్ధ ట్యాంకులు