Mlc Ramasubbareddy comments:నూతన కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి వైసిపి నేతల సహకారం, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సిఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బలపరచి నందుకు కృతజ్ఞతలు…18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 మంది వెనుకబడిన వర్గాల, తరగతుల వారిని ఎంపిక చేశారు సిఎం జగన్..పదవుల కోసం పార్టీలు మారలేదు..40 ఏళ్లు సుదీర్ఘంగా ఒకే పార్టీలో పోన్నపు రెడ్డి కుటుంబం కొనసాగిన చరిత్ర నాది అన్నారు. చేయని తప్పులు హత్య కేసులో ఇరికించారు. నిజాయితీగా టిడిపిలో పని చేశానన్నారు.
Read Also: Maharashtra: చంటి బిడ్డతో బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యే..
అన్నాడు ఆదినారాయణ రెడ్డి ఎన్నో ఇబ్బందులు మా కుటుంబాన్ని పెట్టారు. టీడీపీలోకి ఆది నారాయణరెడ్డి రాకను ఆనాడు వ్యతిరేకించాను. ఎప్పుడూ రాజీ పడలేదు. నన్ను అల్లుడులాగా చూసుకున్నారు అంటున్నారు..పార్టీలో ఉండగా ఎన్నో కష్టాలు పడ్డాము…ఎన్టీయార్ కు కొడుకులా పనిచేశాను..నేను కాదు ఇప్పుడు ఉన్న నేతలు అల్లుళ్ల లాగా ఉన్నారు..నిజాయితీగా టిడిపి నేతలు మాట్లాడాలి..ప్రలోభాలకు ఎప్పుడూ లొంగలేదు..నేను వదిలేసిన ఎమ్మెల్సీ పదవిని దేవగుడి కుటుంబం అనుభవిస్తోంది..అభివృద్ధి కోసం డైనమిక్ నాయకుడైన వైఎస్ జగన్ నాయకత్వంలో ఉండాలని వైసీపీలోకి వచ్చానన్నారు రామసుబ్బారెడ్డి.2019 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసేందుకు తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని విసిరి పారేశానని, ఆ పదవినే ఇప్పుడు దేవగుడి కుటుంబం అనుభవిస్తుందని రామసుబ్బారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
