NTV Telugu Site icon

MLC Ramagopal Reddy: ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయాలి!

Mlc Ramagopal Reddy

Mlc Ramagopal Reddy

పులివెందుల సమస్యలను, అసంపూర్తి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ విఫలం అయ్యారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేంపల్లిలో త్రాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించాలని.. మాజీ సీఎంగా పులివెందుల సమస్యలను అర్జిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారన్నారు. వేంపల్లి పంచాయితీలో పని చేసిన ఈఓలు బాధ్యత రహితంగా వ్యవహరించారని, జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు రవి శంకర్ రెడ్డి రూ.52 లక్షలు ఎత్తుకెళ్లిన మాట వాస్తవం కాదా? అని రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

వేంపల్లిలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ‘పులివెందుల సమస్యలను, అసంపూర్తి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ విఫలం అయ్యారు. అసెంబ్లీకి వెళ్లని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. వేంపల్లిలో త్రాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల పరిస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించాలి. మాజీ సీఎంగా పులివెందుల సమస్యలను అర్జిస్తే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారు. వేంపల్లి పంచాయితీలో పనిచేసిన ఈఓలు బాధ్యత రహితంగా వ్యవహరించారు. జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు రవి శంకర్ రెడ్డి రూ.52 లక్షలు ఎత్తుకెళ్లిన మాట వాస్తవం కాదా?. తాజాగా సస్పెండ్ అయిన ఈఓ నాగసుబ్బరెడ్డి కోటి 88 లక్షలు మింగేశాడు. ప్రజలు కట్టిన పన్నును తమ అకౌంట్లలో వేసుకొని ఆస్తులు పెంచుకున్నారు. ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేశారు’ అని మండిపడ్డారు.

‘ఏడాదిగా గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించకుండా వ్యవస్థను నాశనం చేశారు. మూడు సమావేశాలకు హాజరుకకపోతే సర్పంచ్, వార్డు సభ్యులు సభ్యత్వం రద్దు అవ్వాలి. సర్పంచ్ రాజీనామా చేయకుండా.. కనీసం ప్రభుత్వ అనుమతులు లేకుండా వైస్ సర్పంచ్ గా శ్రీనివాసులు కొనసాగడం ఆశ్చర్యం. వారం లోగా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం. ఇప్పటికే NRGC ద్వారా సిమెంట్ రోడ్డు పనులు వేస్తున్నాం. వేంపల్లి పట్టణ అభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. బస్టాండ్, తువ్వపల్లి బ్రిడ్జిలను త్వరలో ప్రారంభిస్తాం’ అని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి చెప్పారు.