NTV Telugu Site icon

Pothula Sunitha Strong Warning: పవన్‌కు ఇదే మా వార్నింగ్‌.. మేం చాటలు, చెXX. ఎత్తితే నీ గతేంటి..?

Pothula Sunitha

Pothula Sunitha

Pothula Sunitha Strong Warning: పవన్ కల్యాణ్‌కు ఇదే మా హెచ్చరిక.. మేం చాటలు.. చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చారు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత.. ఈ రోజు డీజీపీని కలిసింది వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం.. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ డీజీపీకి ఫిర్యాదు చేశారు.. పవన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. వాలంటరీ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు హేయమైనవి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం వాలంటరీ వ్యవస్థను మెచ్చుకున్నారు.. కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు దేశానికే ఆదర్శంగా తెలిపిన ఆమె.. చంద్రబాబు, లోకేష్ లకు రాజకీయాలు చేసే దమ్ములేక పవన్ ను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్‌.. టీడీపీ కోసమే రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు పోతుల సునీత.. చంద్రబాబు, లోకేష్ ల జేబు సంస్థగా పవన్ పని చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్.. ఏపీకి టూరిస్టులు మాత్రమే.. కరోనా సమయంలో మీరంతా ఏమైపోయారు..? అంటూ నిలదీశారు. పవన్ కల్యాణ్‌కు మహిళలంటే గౌరవం లేదు.. వాలంటీర్లను చాలా చిన్న చూపు చూస్తున్నాడు.. తన వ్యక్తిగత జీవితంలో మహిళలను మోసం చేసిన మోసగాడు పవన్.. అందుకే వాలంటీర్ల పట్ల పవన్ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్‌ ను రెండు చెప్పులతో కొట్టడానికి వాలంటీర్లంతా సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించారు పోతుల సునీత.. అమ్మవారి పేరు పెట్టుకున్న వారాహి వాహనంలో యాత్ర చేస్తున్న పవన్.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. పవన్ కు ఇదే మా హెచ్చరిక.. మేం చాటలు.. చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. పవన్ కల్యాణ్‌ మహిళలకు.. వాలంటీర్లకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పవన్.. చంద్రబాబేనా నీ కేంద్ర నిఘా సంస్థ? అంటూ నిలదీశారు.. చంద్రబాబు నీ చెవిలో ఊదితేనే ఇవన్నీ మాట్లాడుతున్నావు అని ఆరోపించారు. పవన్ వంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో యాత్రలు చేయడానికి లేదు.. పవన్‌ని వెంటనే అరెస్ట్ చేయమని డీజీపీని కోరామని తెలిపారు పోతుల సునీత.