Site icon NTV Telugu

MLC Kavitha: నీళ్లు కూడా తాగను.. పోలీస్ స్టేషన్‌లో కూడా దీక్ష చేస్తా!

Mlc Kavitha Hunger Strike

Mlc Kavitha Hunger Strike

MLC Kavitha Hunger Strike for 42 percent BC Reservations in Telangana: 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్‌ అంబేడ్కర్‌, జ్యోతీరావ్ ఫులే, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు నివాళి అర్పించారు. నిరాహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ జాగృతి శ్రేణులు తరలివచ్చి.. ఎమ్మెల్సీ కవితకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం ధర్నాచౌక్‌ నినాదాలతో దద్దరిల్లిపోతోంది. దీక్ష సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. నీళ్లు కూడా తాగకుండా దీక్షలో కూర్చుంటా అని, కాదని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి పంపినా లేదా ఇంటికి పంపినా అక్కడ కూడా దీక్ష చేస్తా అని హెచ్చరించారు.

‘ఇందిరా పార్క్ వద్ద ఇంతమంది వచ్చి ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆలోచన చేయాలి. ఇక్కడికి వచ్చిన వారందరికీ వ్యక్తిగత బాధ్యులు ఉన్నాయి. అయినా అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాము. రాజకీయంగా అందరికీ ప్రాధాన్యత దక్కాలి. జనాభాలో సగం జనాభా ఉన్న బీసీలకు సరైన రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్‌తో ఇక్కడ దీక్ష చేయడానికి వచ్చాము. ఇది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం. గాంధీ గారి సంకల్పంతో 72 గంటలు దీక్ష చేపట్టాం. రాజకీయంగా అడిగాము, రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చెప్పాము. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. బిల్లు పెట్టి కేంద్రంపై ఆరోపణలు వేసి వదిలేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే.. ముస్లింలకు సపరేటుగా రిజర్వేషన్ డిక్లేర్ చేయండి. అప్పుడు బీజేపీ నేతలపై వత్తిడి తెద్దాం. కానీ బీజేపీ, కాంగ్రెస్ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారు’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

’72 గంటలు నిరాహార దీక్ష చేస్తాం అంటే ప్రభుత్వం భయపడుతుంది. మాకు 72 గంటలు దీక్షకు పెర్మిషన్ ఇవ్వకుండా సాయంత్రం 4 గంటలకు దీక్ష పూర్తి చేయాలని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే దీక్షకు పెర్మిషన్ ఇచ్చారు. ఆంధ్రా ప్రభుత్వం కంటే అధ్వానంగా మారారా మీరు. మేము 72 గంటలకు పెర్మిషన్ ఇవ్వమని కోర్టుకు కూడా వెళ్తున్నాం. కోర్టుతో మొట్టి కాయలు వేయకముందే.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటది. మీడియా మిత్రులు కూడా బీసీ బిల్లుపై పెద్ద పాత్ర పోషించాలి. నాలుగు పిల్లర్లలో పవర్ ఫుల్ పిల్లర్ మీడియా. మిగతా మూడు పిల్లర్లను ప్రశ్నించే హక్కు మీడియాకి ఉంది. గత రెండేళ్లుగా ఎంపీటీసీలు ఉన్నారా, జెడ్పీటీసీలు ఉన్నారా. ఎందుకు ఎన్నికలు జరగడం లేదు. తమిళనాడులో అందరూ ఒక్కటై కేంద్రంతో కోట్లడారు. అందుకే వాళ్ళు సాధించుకున్నారు. మనం కూడా అందరం కలిసి పోరాడుదాం’ అని కవిత పిలుపునిచ్చారు.

Also Read: Domestic Violence: శాడిస్ట్ భర్త చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య.. కలకలం రేపుతోన్న నవ వధువు లెటర్‌!

‘మాకు తప్పకుండా 72 గంటలు దీక్షకు పెర్మిషన్ ఇవ్వాలి. నీళ్లు కూడా తాగకుండా దీక్షలో కూర్చుంటా. కాదని అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్‌కి పంపినా, ఇంటికి పంపినా అక్కడ కూడా దీక్ష చేస్తా. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం చేస్తా. కేవలం కవిత అక్క ఒక్కతే దీక్ష చేస్తే సరిపోదు. యావత్ బీసీ కార్యకర్తలు దీక్ష చేయాలి. కవిత అక్క దీక్ష చేస్తుందిగా.. మేము పొలం పని చేసుకుంటామని అనుకోకండి. ఇందిరా పార్క్ వద్ద దీక్షా స్థలానికి రండి. ఇక్కడికి రాలేని వారు.. అక్కడి నుండే సోషల్ మీడియాలో సపోర్ట్ చేయండి. మన దీక్షకు సోషల్ మీడియాలో మద్దతు తెలపండి’ అని కల్వకుంట్ల కవిత కోరారు.

Exit mobile version