ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూన్ 3 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మే 20 వరకు పొడిగించిన రిమాండ్ గడువు నేటితో ముగిసింది. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవిత.. తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో కవితకు రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కాగా.. ఈ కేసులో మార్చి 26 నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే..
Read Also: Hema Photo Leaked: రేవ్ పార్టీలో హేమ ఫోటో లీక్?
ఇదిలా ఉంటే.. ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్), సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత జ్యుడిషియల్ రిమాండ్ గురించి విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో.. రెండు దర్యాప్తు సంస్థల తరుఫున కవిత రిమాండ్ లో ఉన్నారు. కాగా.. కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ చాలాసార్లు కవితకు బెయిల్ రిజెక్ట్ అవుతూనే ఉంది.
Read Also: World Championship 2024: చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్ దీప్తి జీవన్‌జీ..