జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మత్తవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. NEET పరీక్ష పేపర్ లీకేజ్ విచారణ ను సుప్రీం కోర్ట్ పరిధి నుండి CBI చేతిలో కి వెళ్ళిందని, విద్యార్థుల జీవితల తో చాలగటం ఆడుతుంది కేంద్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. నీట్ పేపర్ లీకేజీ పై సుప్రీం కోర్ట్ లొ విచారణ చేపట్టాలని, నీట్ పేపర్ లీకేజీ లొ కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ లొ పరదర్శకత లోపించిందని, నీట్ పరీక్ష నిర్వహణ పై రాష్టాలకె అధికారం కల్పించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. CBI అంటే కేంద్ర ప్రభుత్వ అజిమాయిషీలో నడిచే సంస్థ అని ఆయన అన్నారు.
MLC Jeevan Reddy : బీజేపీ ప్రభుత్వం మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుంది

Jeevan Reddy