జగిత్యాల జిల్లా జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల పర్యటనను తలపించిదన్నారు. ఈదురు గాలులతో వడగండ్ల వానతో నష్ట పోయిన పంటను అంచనా వేయడం ప్రభుత్వ బాధ్యత అని, జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Adimulapu Suresh: అందుకే నేను చొక్కా విప్పా.. సిగ్గు పడటం లేదు..
ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందని, 15 వేల కోట్లు ఇచ్చానని వాట్స్ అప్ మెసేజ్ చేస్తే సీబీఐ కవితను విచారణ చేయకుండా ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయన్న జీవన్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి ముస్లింల రిజ్వేషన్లను రద్దు చేస్తాం అంటే ఎట్లా రద్దు చేస్తారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు చూస్తున్నారని ఆయన విమర్శించారు. పంట నష్టాలను జాతీయ విపత్తుగా గుర్తించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అనేది సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని, దాని గురించి హోమ్ మంత్రి ఎలా మాట్లాడతారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : Ram Gopal Varma: బిగ్ బ్రేకింగ్.. వర్మ కొత్త ఛానెల్.. వివేకా మర్డర్ కేసు స్పెషల్