NTV Telugu Site icon

MLC Jeevan Reddy: కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు హాస్యాస్పదం

Jeevan Reddy

Jeevan Reddy

కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దళిత సంక్షేమం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే.. కేసీఆర్ సర్కర్ దళితులకు ఎన్ని ఇల్లు కట్టారు.. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్ళో మేము ఓట్లు అడుతామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్న ఊళ్ళో సీఎం కేసీఆర్ ఓటు అడగాలని ఆయన పేర్కొన్నారు. దళితులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని జీవన్ రెడ్డి చెప్పారు.

Read Also: Tata Nexon facelift: నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసిన టాటా.. సోనెట్, వెన్యూ, XUV 300కి వణుకే.. ఎలా ఉందో లుక్కేయండి..

దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేశారా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దళిత బంధ అర్హులైన లబ్ది దారులకు అందించలేని అసమర్థ మీది.. దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తారో ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు అని ఆయన అన్నారు. గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధులు ఇచ్చారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన మొదటి 4 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం కోసం పని చేశారు.. ఆఖరు సంవత్సరం ప్రజల కోసమంటూ ఎన్నికల ముందు హడావిడి చేస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు.

Read Also: India vs Pakistan LIVE Score, Asia Cup 2023: టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వలేదు అని జీవన్ రెడ్డి అన్నారు. దళితులకు పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్స్ ఎందుకు పెంచలేదు.. మేము పెంచుతాం అంటే అందుకు ఎంత ఉలిక్కిపాటు.. మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ పై విమర్శలు కాదు.. ఎస్సీ సంక్షేమంలో జరుగుతున్న అన్యాయం పై కేసీఆర్ ను ప్రశ్నించు అని ఎమ్మె్ల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.