మన తరుపున పోరాడుతూ.. మన కష్టాలపై మాట్లాడే వ్యక్తికి ఓటు వేయండని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. పట్టభద్రులందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నిక ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం అని, చైతన్య వంతులైన విద్యావంతులు పనిచేసే వారికి మద్దతుగా నిలవాలన్నారు. పట్టభద్రులందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. తమలోని చైతన్యాన్ని చూపాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలోఎమ్మెల్యే రాము ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ… ‘పట్టభద్రులందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత వేగంగా పోలింగ్ జరగడం సంతోషకరం. ఓట్లు వేసేందుకు పట్టభద్రులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఈ ఎన్నిక ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం.. చైతన్యవంతులైన విద్యావంతులు పనిచేసే వారికి మద్దతుగా నిలవాలి. పట్టభద్రులందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమలోని చైతన్యాన్ని చూపాలి. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాలన్నా.. జాబ్ క్యాలెండర్ రావాలన్నా ఎవరి ద్వారానో పట్టభద్రులు గుర్తించాలి. మన తరుపున పోరాడుతూ.. మన కష్టాలపై మాట్లాడే వ్యక్తికి ఓటు వేయండి’ అని అన్నారు.