NTV Telugu Site icon

MLC Elections 2025: ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, లోకేశ్‌!

Cm Chandrababu Vote

Cm Chandrababu Vote

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో సీఎం ఓటు వేశారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేశ్‌ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి యూపీ స్కూల్ పోలింగ్‌ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేశ్‌ చేరుకుని ఓటు వేశారు.

కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానంలో 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (కూటమి), కేఎస్‌ లక్ష్మణరావు (పీడీఎఫ్‌) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది’ అని సీఎం పేర్కొన్నారు.