AP BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఏ కన్వెన్షన్ హాల్ కు బీజేపీ ఎమ్మెల్యేలు, పురంధేశ్వరి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో బీజేపీ శాసన సభాపక్ష నేత ఎంపికపై జోరుగా చర్చ కొనసాగుతుంది.
Read Also: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ జోడీగా రవితేజ హీరోయిన్..
ఇక, బీజేపీ అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కూటమి మీద విశ్వాసంతో మంచి విజయం అందించారు.. ప్రజలు ఇచ్చిన భరోసాను మా పని తీరుతో నిలబెట్టుకుంటామన్నారు. శాసన సభాపక్ష సమావేశంలో పాల్గొని మా అభిప్రాయాలు వివరిస్తామని ఆమె వెల్లడించారు. ఇక, రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు.. రాష్ట్ర బీజేపీ పక్షాన రేపు మేమంతా ఆ సభలో పాల్గొంటున్నామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.