Site icon NTV Telugu

YCP: మడకశిర వ్తెసీపీలో లేఖ కలకలం.. సోషల్ మీడియాలో వైరల్

Ycp Mla

Ycp Mla

శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలోని వైసీపీలో లేఖ కలకలం రేపుతుంది. నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంపై ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ పరిశీలకుడు ఆశోక్ కుమార్ కు ఎమ్మెల్యే లేఖ రాశాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు లేకుండా సమావేశం ఎలా జరపడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో ఉన్న తనకు కొన్ని గంటల ముందు సమాచారం ఇచ్చారని ఎమ్మెల్యే తిప్పేస్వామి మండిపడ్డారు.

Read Also: Layoff : అమెజాన్, గూగుల్ తర్వాత 700మంది ఉద్యోగులను తొలగించిన మరో టెక్ కంపెనీ

ఈ మీటింగ్ కు తాను హాజరు రాకుండా ఉండాలన్న ఉద్ధేశ్యంతోనే సమావేశం ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆరోపించారు. దళిత వర్గానికి ఏం సందేశం పంపంచాలని అనుకున్నారో తెలియజేయాలని లేఖలో ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇదీ పార్టీకి తీవ్ర నష్టం కలిగించదా అని లేఖలో ఆయన ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే తిప్పేస్వామి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version